మణుగూరు, జూలై 03 (వై 7 న్యూస్);
మణుగూరు సింగరేణి ఏరియా జీఎం కార్యాలయం ఎదుట కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు టిబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ నాగేల్లి వెంకట్ మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆయన, కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ చేపట్టిన ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న ఆందోళనలకు టిబీజీకేఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
దీక్షల్లో కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Post Views: 9








