E-PAPER

AI డైట్‌తో 45 రోజుల్లో 20 కిలోల బరువు తగ్గాడు.. చివరకు ICUలో చేరిన యువకుడు

బరువు తగ్గేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) ఇచ్చిన సలహాలను అనుసరించిన చైనాకు చెందిన 34 ఏళ్ల కంటెంట్ క్రియేటర్ చెన్ తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. సుమారు 120 కిలోల బరువున్న చెన్ వేగంగా బరువు తగ్గాలని నిర్ణయించుకుని, వైద్యులు లేదా డైటీషియన్‌ను సంప్రదించకుండా AI రూపొందించిన డైట్, వ్యాయామ ప్రణాళికను పాటించాడు.

చెన్ కేవలం 45 రోజుల్లో 20 కిలోల బరువు తగ్గాడు. అయితే వేగంగా బరువు తగ్గే క్రమంలో అతడి ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా క్షీణించినట్లు తెలుస్తోంది. చివరకు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరాల్సి రావడంతో వైద్యులు అతడిని ఐసీయూకు తరలించి చికిత్స అందించారు.

ఈ ఘటన వేగంగా బరువు తగ్గేందుకు AI లేదా ఆన్‌లైన్‌లో లభించే డైట్ ప్లాన్‌లను వైద్యుల సలహా లేకుండా అనుసరించడం ఎంత ప్రమాదకరమో చెబుతోంది. ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితి, వయసు, శరీర అవసరాలు భిన్నంగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గే లక్ష్యంతో ఆహారం, వ్యాయామంలో పెద్ద మార్పులు చేసే ముందు అర్హత కలిగిన వైద్యుడు లేదా డైటీషియన్‌ను సంప్రదించడం మంచిది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!