మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి ఏరియాలోని పీవీ కాలనీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సారపాకకు చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
పోలీసులు గుర్తించిన వివరాల ప్రకారం.. బూర్గంపాడు మండలం సారపాకలోని విజయనగరం కాలనీకి చెందిన పాకా నవీన్ అనే యువకుడు బైక్‌పై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై ముగ్గురు ప్రయాణిస్తున్న సమయంలో మరో మహిళను ఢీకొట్టి కిందపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నవీన్ తలకు బలమైన గాయాలు కావడంతో మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ప్రమాదానికి గల పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
Post Views: 190








