నిజామాబాద్ వై7 న్యూస్
మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య పిలుపు
మాల మహానాడు నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లుతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న చెన్నయ్య
ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన మాల మహానాడు జిల్లా కమిటీని అధికారికంగా ప్రకటించిన చెన్నయ్య, మాజీ జిల్లా అధ్యక్షులు సీనియర్ నాయకులు అయిన ఆనంపల్లి ఎల్లయ్యను రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్గా నియమిస్తూ నియామక పత్రం అందజేశారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శిగా శట్పల్లి నారాయణ ను నియమించి నియామక పత్రం అందజేశారు
నిజామాబాద్ లోని ఒక పంక్షన్ హాల్ లో జిల్లా అధ్యక్షులు దేవిదాస్ అధ్యక్షతన జరిగిన మాల మహానాడు జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చెన్నయ్య గారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేసి రాష్ట్ర ప్రభుత్వం మాలలను పూర్తిగా అణిచివేసే ప్రయత్నం చేసింది అని దీనిని ఎదుర్కొనేందుకు మాలలు న్యాయ పోరాటం తో పాటు, ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలి అని పిలుపునిచ్చారు
ఈ సమావేశంలో అతిథులుగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు, టీమ్ జిల్లా కన్వీనర్ అలుక కిషన్, మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ ఎడ్ల నాగరాజు, మాజీ మేయర్ దండు శేఖర్, వర్కింగ్ ప్రసిడెంట్ అనంపల్లి ఎల్లయ్య హంసా రాష్ట్ర అధ్యక్షులు అంగరి ప్రదీప్ లు పాల్గొని మాట్లాడగా, జిల్లా డివిజన్ స్థాయి ముఖ్య నాయకులు అందరూ సమావేశానికి హాజరయ్యారు
ఈ సమావేశానికి ముందు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్, పి. వి. రావు చిత్ర పటాలకు పూలమాల లు వేసి ఘనంగా నివాళులర్పించారు
జిల్లా అధ్యక్షులుగా దేవిధాస్, ప్రధాన కార్యదర్శిగా వినయ్,ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, కోటేశ్వర్, గంగాధర్ తదితరులతో కూడిన కార్యవర్గ సభ్యు లందరిని చెన్నయ్య పూలమాలలతో సత్కరించింది అభినందించారు
జై భీమ్, జై మాల









