E-PAPER

అశ్వాపురం వై7 న్యూస్

టిఆర్ఎస్ పార్టీ, బిజెపి పార్టీలు వారి పార్టీలను బలోపేతం చేయడం పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా టిఆర్ఎస్, బిజెపి పార్టీలు ప్రజా మద్దతును ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది. కారణం ఏమిటంటే వారికంటూ ప్రజల సమస్యలపై అవగాహన లేకపోవడమే వారికి ఉన్నదంతా కాంగ్రెస్ పార్టీపై అక్కసు మాత్రమే.
కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, జాతీయ విధానం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలను పరిష్కరించుకోగలరు. ఇతర పార్టీలు అత్యుత్సాహం ప్రదర్శించడం మానుకోవాలి. బట్టలు చించుకుంటూ, గింజుకుంటూ బిజెపి పార్టీ జాతీయ వాదాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్న, తీరు హేయమైంది. భారత జాతీయ స్వాతంత్ర్య ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన పోరాటాన్ని ఏమాత్రం తక్కువ చేయలేరు.
అదే క్రమంలో జాతీయ స్వాతంత్ర్య పోరాటంలో బిజెపి పాత్ర శూన్యం అని సభ్య సమాజానికి తెలుసు…అలాగే తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో అమరుల త్యాగాలను గుర్తించడంతో కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియమ్మ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. 1000 జన్మలు ఎత్తిన, టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించలేదు. అమరుల త్యాగాలు చూసి సోనియమ్మ ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజానీకం రుణపడి ఉంది.దెయ్యాలు వేదాలు వల్లించినట్లు పనికిరాని వీడియోలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా ఫలితం శూన్యం… ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి ప్రయత్నిస్తే ప్రజలు ఆదరిస్తారు..ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తారు..
ఎంతో క్రమశిక్షణతో పరిపాలన కొనసాగిస్తూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి, రక్షణ విషయంలో కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగిస్తుంటే, గత ప్రభుత్వం చేసిన అప్పులను ఒక్కొక్కటిగా తీరుస్తూ రాష్ట్రాన్ని గాడిలో పెడుతుంటే చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం మానుకోవాలి.. ఆనాడు శ్రీమతి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మొదలుకొని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పేదల పక్షమే, ఆనాడైనా… ఈనాడైనా,.. నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు, కేటాయించి నిరుపేదల పక్షాలు నిలిచింది కాంగ్రెస్ పార్టీనే.., డబుల్ బెడ్ రూమ్ అని మాయ మాటలు చెప్పి నిరుపేదలకు ఇల్లు కట్టించకుండా మోసం చేసే విధానం కాంగ్రెస్ పార్టీది కాదు… వాస్తవాలను ప్రజలకు వివరిస్తూ బడ్జెట్ కేటాయింపుల ప్రకారం విడతల వారీగా ఇందిరమ్మ ఇల్లు ప్రతి నిరుపేదకు అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం… ఆనాడు అధికారంలో ఉన్న ప్రతిపక్షాలు ప్రాజెక్టుల ఖర్చులను అమాంతం మూడు రెట్లు పెంచేసి కమిషన్ల దండుకొని ప్రాజెక్టులను అసంపూర్తిగా వదిలేసి డిపిఆర్లు
వేలకోట్ల రూపాయలు దండుకొని, ప్రతిపక్ష పార్టీలు ప్రస్తుతం రాద్దాంతం చేయడం విడ్డూరం… స్వాతంత్ర్యానికి ముందు తర్వాత ఏళ్లుగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం ద్వారా ప్రజలకు హక్కులు కల్పించడం ద్వారా స్వేచ్ఛనిచ్చి దేశంలోనే ఏకైక సెక్యులర్ కాంగ్రెస్ పార్టీ స్వీకరించడం ద్వారా భారత సమాజం ఈనాడు భిన్నత్వంలో ఏకత్వంగా మత విద్వేషాలు కులమత గొడవలు లేకుండా ఒకే జాతిగా భారతజాతిగా కలిసి మెలిసి జీవిస్తున్నారు…
దేశంలో మత విద్వేషాలు మనువాదాన్ని రెచ్చగొడుతూ బిజెపి పార్టీ ఏం సాధించింది.
ఇదంతా ఆనాటి కరుడుగట్టిన జాతీయ కాంగ్రెస్ నాయకత్వం స్వాతంత్ర పోరాట యోధుల ఫలితంగా మనకు వారసత్వంగా లభించింది.. ఈనాటి సమాజం, పౌరులు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసిన సేవలను గుర్తించి పార్టీకి విధేయంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతిపక్షాలు అడ్డగోలు పనికిరాని సత్య దూరమైన ఆరోపణలు చేయడం ద్వారా వారి పార్టీ యొక్క విధానాలను ప్రజల్లో దిగజార్చుకుంటున్నారు.. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని భారతదేశానికి జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆనాడైనా… ఈనాడైనా… దేశానికి చేసిన సేవలను గుర్తిస్తూ, గమనిస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటూ వారి సంక్షేమ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతుందని గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం… అదే క్రమంలో రాష్ట్ర బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి వడివడిగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.., పొద్దున్న లేస్తే మొదలు పనికిరాని, అసత్య, అడ్డగోలు ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలను ఖండించాలని, కాంగ్రెస్ ప్రభుత్వానికి, నిరుపేదలు, నిరుద్యోగులు, వ్యవసాయ రైతులు, బలహీన వర్గాలు, కార్మికులు, మహిళలలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం…..
రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఉనికి చాటేందుకు చేస్తున్న తప్పుడు ఆరోపణలను, ప్రజలు గమనిస్తూ తిప్పి కొట్టాలని, ప్రజలకు మంచి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం…

కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్త
బర్ల కిరణ్ …

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News