E-PAPER

ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మానం

మణుగూరు:

మణుగూరు మండలంలో పలు ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి చదివి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మణుగూరు వాసవి క్లబ్ వనితా వైభవం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు 580కి పైగా మార్కులు సాధించిన సత్య అనిశిని, సిరి, దుర్గా ప్రసాద్, వేదశ్రీ లను శాలువాలతో సన్మానించి పుస్తకాలు, పెన్నులు అందజేసి విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ… ఇష్టపడి చదువుతూ మరిన్ని విజయాలు సాధించాలని, తల్లి దండ్రులకు, మణుగూరు పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కిరాణా మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దోసపాటి నాగేశ్వరరావు, వాసవీ క్లబ్ అధ్యక్షుడు శ్యామ్, వనిత వైభవం అధ్యక్షురాలు బొగ్గవరపు అంజలి, IPC బండారు నర్సింహారావు, జిల్లా పీ ఆర్ ఓ కడవెండి విశ్వనాథ గుప్తా, జిల్లా జాయింట్ సెక్రటరీ శేషుబాబు, సముద్రాల కృష్ణమూర్తి, కంకటాల సాయి, ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు చిత్తలూరి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News