మధిర
కాలం చెల్లిన బస్సు లతో ప్రయాణకుల ఇబ్బందులు, ఆగిన బస్సును వెనుకనుండి నెట్టకపోతే కదిలే పరిస్థితి లేదు, సాక్షాత్తు ఈ సంఘటన శుక్రవారం ఉదయం 6:30 నిముషములకు ఎర్రుపాలెంలో జరిగింది మధిర డిపో నుంచి విజయవాడ బయలుదేరిన టి ఎస్ ఆర్ టి సి (AP29Z2113) బస్సు అనూహ్యంగా ఆగిపోయింది,బస్సు లో ఉన్న ప్రయాణికులు పది మంది దిగి నెడితే కానీ సెల్ఫ్ స్టార్ట్ అవ్వటంతో బస్సు కదిలింది, అసలే ఉచిత బస్సు ప్రయాణం పధకాలతో కాలం నెట్టుకోస్తుంటే ఈ బస్సు నెట్టుడేందని ప్రజలు పెదవి విరుస్తున్నారు,కాగా మధిర డిపో బస్ లు కాలం చెల్లినవి అనడానకి ఇది నిదర్శనం, ప్రభుత్వం కొత్త బస్సులు వేసి ప్రయాణీకులను బాధలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.లేడీ కండక్టర్ తొ సహా బస్ ను నెట్టడం కోసమెరుపు.
Post Views: 165









