E-PAPER

ప్రజల కోసం సీసీ రోడ్డు నిర్మాణం చేసిన తాజా మాజీ మున్సిపల్ చైర్మన్

తూప్రాన్, మార్చి,27. వై సెవెన్ న్యూస్

ప్రజల సౌకర్యార్థం తన సొంత డబ్బులు హెచ్చించి సీసీ రోడ్డు నిర్మాణమును చేసి ప్రజలకు అంకితం చేశారు మన తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ. వివరాలు ఇలా ఉన్నాయి… తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు కిందివాడకట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం ముందు సిసి రోడ్డును గురువారం రోజు తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు శ్రీమతి & శ్రీ మామిళ్ల జ్యోతి కృష్ణ గారి పర్యవేక్షణలో వేయడం జరిగింది. ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం మరియు ప్రతినిత్యం గుడిలో దర్శనం కోసం వచ్చే భక్తులకు, గ్రామ ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఉండేటట్లుగా ఈ సి సి రోడ్డు వేసినట్లు మామిoడ్ల కృష్ణ తెలిపారు. ఈ సీసీ రోడ్డు వేయించడం తో వార్డు ప్రజలే కాకుండా గ్రామ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మామిండ్ల కృష్ణ, బొల్లునాగులు, గుజ్జ మహేష్ యాదవ్ ఇతరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News