E-PAPER

ఆభోతుపల్లి పొండేటి యాదగిరి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బుడ్డ భాగ్యరాజ్

తూప్రాన్, మార్చి, 27. వై సెవెన్ న్యూస్

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోనీ రెండవ వార్డు అబోతుపల్లి కి చెందిన పొండేటి యాదగిరి అప్పులబాధతో, ఆర్థిక సమస్యలతో మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించారు. మృతుని భార్య మహేశ్వరికి తోచిన సహాయంగా దశదినకర్మకు ఆర్థిక సహాయం 50 కేజీల బియ్యం ను గురువారం ఉదయం మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్, చందాయిపేట తాజామాజీ సర్పంచ్ స్వర్ణలత లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఎం.పి, పి.ఎం.పి డాక్టర్లు అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ అప్సర్ భాయ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్తపల్లి నర్సింగరావు, గుర్రం రాము, గుడిసె సిద్ధిరాములు, పోడేటి స్వామి తదితరులు ఉన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News