E-PAPER

భగత్ సింగ్ సుఖదేవ్ రాజగురులకు కాగడాలతో నివాళి

మణుగూరు. 24 మార్చి 2025.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గం,మణుగూరు ఏరియా,ఏఐటీయూసీ ఆఫీస్ లో భగత్ సింగ్ సుఖ దేవ్ రాజాగూరులకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కాగడాలతో ఘనంగా నివాళి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ మణుగూరు బ్రాంచి సహాయ కార్యదర్శి జీ.పుల్లారావు ఆవుల నాగరాజులు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య కోసం నునుగు మీసాల నవయువ యోధులు భరత్ సింగ్ శుక్దేవ్ రాజాగూరులు పరపాలన విముక్తి కోసం దేశ దాస్య శృంకలాలు తెంచేందుకుం భరతమాత బిడ్డలుగా బ్రిటీస్ పాలకుల గుండెల్లో బాంబుల వర్షం కురిపించి భయం ఎరుగని విప్లవ దీరులు మనదేశ కోసం ఎందరో నవయువకులకు పోరాట మార్గం చూపిన గొప్ప నాయకులు దేశంకోసం ఊరికొయ్యలు ముద్దాడి అమూల్యమైన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి దేశానికి స్వేచ్ఛ వాయువులను అందించిన నవయవ్వన యువతరం భగత్ సింగ్ సుఖదేవ్ రాజాగూరులు వారి ప్రాణత్యాగం మరువలేనిదని అన్నారు.వారి 94వ వర్ధంతి జరుపుకోవడం జరిగింది. వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి నేటి యువరక్తం ముందుకు రావాలని అన్నారు. చెడుమార్గాలకు చెడుఅలవాటులకు మత్తుకు బానిసలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెడు మార్గంలో పయనించే యువత పోరాట యోధుల చరిత్ర చదవాలని పాఠ్య పుస్తకాలల్లో పాఠ్య అంశాలుగా పెట్టి మన దేశనికి ఉపయోగపడే యువతగా తీర్చి దిద్దాలని మతం మే దేశభక్తి అనుకుంటే పొరపాటు అని యువతరం తెలుకోవాలని అన్నారు. అనంతరం చిత్రపటానికి పూల మాలలువేసి కొవ్వతులతో కాగడాలతో ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాలతో ఘనంగా నివాళి అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ బ్రాంచి సహాయ కార్యదర్శి మేకల ఈశ్వర్ ఆపీస్ బేరర్స్ ఆదేర్ల సురేందర్ శనిగారపు కుమారస్వామి ఫిట్ సెక్రటరీస్ సాయి ప్రకాష్ శరత్ శివ రవికుమార్ సందీప్ రవి రమేష్ ప్రవీణ్ పారారావు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News