ఎమ్మెల్యే పాయం కు కృతజ్ఞతలు తెలిపిన మణుగూరు అధ్యక్షులు పీరినాకి నవీన్
మణుగూరు, మార్చి 25 వై 7 న్యూస్;
పినపాక నియోజకవర్గం కేద్రం మణుగూరు మండలంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి మరో కొత్త శోభను తీసుకువచ్చే విధంగా పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్ల చొరవతో 7 మంది నూతన స్పెషలిస్ట్ వైద్యులను ప్రభుత్వం నియమించడం మణుగూరు ప్రజలకు శుభపరిణామం. గతంలో ఉన్న 6 మంది వైద్యులతో పాటు ఇప్పుడు మొత్తం 13 మంది వైద్యులు అందుబాటులో ఉండటంతో వైద్యసేవలు మరింతమెరుగుపడనున్నాయి.
మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నియమితులైన వైద్యుల వివరాలు
నూతనంగా నియమించబడిన స్పెషలిస్ట్ వైద్యులు – 7
గైనకాలజిస్ట్ (GYNAECOLOGIST) – 2
అనస్థీషియాలజిస్ట్ (ANAESTHESIOLOGIST) – 2
పిల్లల వైద్యుడు (PEADIATRICIAN) – 1
జనరల్ ఫిజీషియన్ (GENERAL
PHYSICIAN) – 1
స్కానింగ్ వైద్యుడు (RADIOLOGIST) – 1
గతంలో ఉన్న వైద్యులు – 6
ఎం.బి.బి.ఎస్ వైద్యులు (MBBS) – 5
డెంటల్ వైద్యుడు (BDS) – 1
మొత్తం వైద్యులు: 13
మణుగూరు ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రిని మరింత బలోపేతం చేసేందుకు తీసుకున్న ఈ నిర్ణయానికి స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, గర్భిణీ స్త్రీలు, పిల్లల కోసం ప్రత్యేక వైద్యుల నియామకం ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. అత్యవసర వైద్య సేవలకు అవసరమైన అనస్థీషియాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్, స్కానింగ్ వైద్యుల సేవలు అందుబాటులోకి రావడం ప్రజలకు మరింత మేలు చేయనుంది. ఈ సందర్భంగా మణుగూరు ప్రజలు తమ తరఫున శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్ల కి మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీరినాకి నవీన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.









