అందుబాటులోకి పూర్తిస్థాయి వైద్యం
వైద్య సేవలు ప్రారంభించిన డాక్టర్లు
పాయం వెంకటేశ్వర్లు కృషిని అభినందిచిన పిరినాకి నవీన్
మణుగూరు, మార్చి 26 వై 7 న్యూస్;
మణుగూరు మండల అధ్యక్షులు పీరినాకి నవీన్ మాట్లాడుతూ ఏజెన్సీలో అత్యున్నత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్య ఆరోగ్యపై ప్రత్యేక దృష్టి పెట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కృషిని అభినందిస్తు, నియోజకవర్గ ప్రజలు మణుగూరు మండలంలో గల 100 పడకల ప్రభుత్వ దావాఖానా కు ఏడుగురు స్పెషలిస్ట్ వైద్యులను తీసుకువచ్చి ఏజెన్సీలో మెరుగైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా హాస్పిటల్ మంజురు చేయించింది కూడా పాయం అని గుర్తు చేసుకోవాల్సిన అవసరం వుంది అన్నారు.ఏడుగురు స్పెషలిస్ట్ వైద్యులు తమ వైద్య సేవలను ప్రారంభించడానికి అభినందనలు తెలుపుతూ గత పాలకుల వైపల్య కారణంగా ఏరియా వైద్యశాల బూజుపట్టి శిధిలావస్థకు చేరే సమయం లో కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, దీక్షలు చేయడం వల్ల పునరావృతం అయి కాంగ్రెస్ ప్రభుత్వం లో ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి రావడం చాలా అభినందనీయం అని తెలిపిన మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీరినాకి నవీన్. ఈ కార్యక్రమంలో మణుగూరు పట్టణ అధ్యక్షులు శివ సైదులు, నీలకంఠేశ్వర స్వామి ఆలయ చైర్మన్ కూచిపూడి బాబు,మండల నాయకులు.. గాండ్ల సురేష్,బల్లెం సురేష్, బర్ల శ్వేతన్,బోజ్జా త్రిమూర్తులు,పల్లపు నాగేశ్వరావు,ఎండి యాకూబ్ ఆలీ, తుపూడి శ్రీనివాస్, సురేందర్ రెడ్డి,శ్రీరాముల పెదులు, తదితరులు పాల్గొన్నారు









