E-PAPER

టీజీ సెట్ పరిక్షా కేంద్రంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

కొత్తగూడెం, ఫిబ్రవరి 23 వై 7 న్యూస్

నవభారత్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో నిర్వహించిన టీ జీ సెట్ పరీక్ష కేంద్రాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించి మరియు 6 7 8 9 తరగతులకు సంబంధించి బ్యాక్ లాక్స్ కొరకు ఆదివారం పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోన్న సోషల్‌ వెల్ఫేర్‌, ట్రైబల్ వెల్ఫేర్‌, బీసీ వెల్ఫేర్‌, గురుకుల విద్యాలయ సంస్థల్లో ప్రవేశాల కోసం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పరీక్ష నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్ష కేంద్రంలోని అన్ని తరగతులకు పరిశీలించి, విద్యార్థులు పరీక్ష రాసే విధానాన్ని గమనించారు.విద్యార్థులకు త్రాగునీరు అందుబాటులో ఉంచాలని పరీక్షకు హాజరయ్య విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రానికి 460 మంది విద్యార్థులు కేటాయించగా అందులో 444 మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు కలెక్టర్ కు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్