E-PAPER

భద్రాచలం అంబేడ్కర్ భవన్ నిర్మాణ పనులు పూర్తిచేయాలి:మేకల లత

భద్రాచలం, ఫిబ్రవరి 21 వై7 న్యూస్;

స్థానిక గోల్డ్ స్మిత్ కాలనీ నందు మహాజన మహిళా సమైక్ఖ్య ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మేకల లత మాట్లాడుతూ వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి ఎదురుగా ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ భవన్ (ఎస్సీ కమ్యూనిటీ హాల్) నిర్మాణ పనులను వేగవంతం చేసి భవనాన్ని ప్రారంబించే విధంగా భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు తగిన చొరవ చూపాలని కోరారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్ (ఎస్సీ కమ్యూనిటీ హాల్) నిర్మాణంలో సంవత్సరాల తరబడి పనులు జరగడంలో జాప్యం కనిపిస్తుందని, ఇంత వరకు భవన్ (ఎస్సీ కమ్యూనిటీ హాల్) నిర్మాణం పూర్తిస్థాయిలో వినియోగం లోనికి రాకపోవడం దురదృష కరమని అన్నారు. ప్రభుత్వాలు మారుతున్న మంత్రులు మారుతున్న కలెక్టర్లు మారుతున్న అంబేడ్కర్ భవన్ నిర్మాణంలో మాత్రం అభివృద్ధి లేదని వాపోయారు. వందలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద ప్రజలకు ఉపయోడవడే అంబేడ్కర్ భవన నిర్మాణాన్ని ఎందుకు అలా వినియోగం లోనికి రాకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి లోపు అంబేద్కర్ భవన (ఎస్సీ కమ్యూనిటీ హాల్ )నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు చేరువయ్యే విధంగా చొరచూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మహాజన మహిళా సమైక్య జిల్లా ఉపాధ్యక్షురాలు కొచ్చర్ల కుమారి, మాదిగ మహిళా సమైక్య జిల్లా ఉపాధ్యక్షురాలు గద్దల కృష్ణవేణి మాదిగ, కొప్పుల నాగమణి మాదిగ తదితరులు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News