భైంసా,జనవరి 24 వై 7న్యూస్ తెలుగు;
భైంసా పట్టణంలోని వార్డ్ నెంబర్ 7 రాహుల్ నగర్ బుద్ధ విహార్ దగ్గర వార్డు సభ నిర్వహించడం జరిగింది. కౌన్సిలర్ అనిత బాలాజీ సూత్రావ్ అధ్యక్షతన భైంసా మున్సిపల్ కమిషనర్ ఈ సభను ప్రారంభించారు. ఏ ఎం సి చైర్మన్ ఆనంద్ రావు పటేల్ పాల్గొన్నారు. మోతిరామ్ మెప్మా స్టాఫ్ సభ్యులు ఈ కార్యక్రమంలో వార్డ్ ప్రజల యొక్క కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోస,మొదలగు పథకాలకు దరఖాస్తులు స్వీకరించారు. గత సంవత్సరము ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాటిలో కొందరికి రాకపోవడంతో ఈసారి అందరూ వచ్చి దరఖాస్తులు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సై గౌస్,సిబ్బంది పాల్గొన్నారు .
Post Views: 105