మండల లబ్ధిదారులు ఎంపిక పారదర్శకంగా జరపబడుతుంది
ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు వస్తాయి
మండల యూత్ కాంగ్రెస్ నాయకులు గుగులోత్ రమేష్ నాయక్
తిరుమలాయపాలెం జనవరి 24 (వై 7 న్యూస్ )
గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వలేదు.. కానీ ప్రస్తుతం ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని మండల యూత్ కాంగ్రెస్ నాయకులు గుగులోత్ రమేష్ నాయక్ అన్నారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ గ్రామసభల్లో ఇందిరమ్మ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల జాబితాను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా అర్హులైన మరికొందరి పేర్లను త్వరలోనే ప్రకటించడం జరుగుతుంది.మార్పులు చేర్పులు ప్రక్రియ కూడా కొనసాగుతుంది, ప్రకటించిన లిస్టులో పేరు లేదని గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మన రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో ప్రతి ఒక్క పథకము అర్హులకు చేరుతుంది , కొంతమంది రాజకీయ లబ్ధి కోసం గొడవలు సృష్టిస్తున్నారని ఆయన అన్నారు .