E-PAPER

కల్లూరు గ్రామసభ లో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ బైంసా సిందే ఆనందరావు పటేల్

నిర్మల్ ,జనవరి 24 వై 7 న్యూస్ తెలుగు;

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చినటువంటి ఆరు గ్యారెంటీ పథకాలలో భాగంగా అమలు పరుస్తున్నటువంటి ఆహార భద్రత కార్డు ఇందిరమ్మ ఇండ్ల గురించి ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తున్నందుకుగాను నేడు బైంసా మండలంలోని మాంజరి గ్రామంలో గ్రామ సభ నిర్వహించగా ఆ కార్యక్రమానికి గాను బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ హాజరయ్యారు.వారు సభను ఉద్దేశించి మాట్లాడుతూ పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని, పేదల పక్షాన నిలబడి పేదల కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ప్రతి ఒక్కరూ అర్హత కలిగిన వారు ఆహార భద్రత కార్డు అప్లై చేసుకోవాలని, అదేవిధంగా ఇల్లు లేని పేదవారు అప్లై చేసుకుని ఇంద్రమ్మ ఇండ్లను పొందాలని, రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా 12 వేల రూపాయలను ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ఈ ప్రతి పథకం మీకు సులువుగా పొందాలంటే ప్రతి ఒక్కరు కలిసి మెలిసి వుండాలని , అప్లై చేసుకుని ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో, స్పెషల్ ఆఫీసర్,ఎమ్మార్వో,గ్రామపంచాయతీ సెక్రటరీ,ఏఈఓ,డిసిసి డైరెక్టర్ వెంకటేష్,మాజీ సర్పంచ్ లక్ష్మణ్ పటేల్, వైస్ ఎంపీపీ మౌనిక నవీన్, ఉప సర్పంచ్ పెంటవార్ దశరథ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆలూరి ప్రశాంత్,మాజీ సర్పంచ్ రమణా గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్