పరవాడ: అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీ (Parawada Pharma City)లో అగ్నిప్రమాదం జరిగింది. మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగాయి..
మంగళవారం ఉదయం కంపెనీలోని ఈటీపీ ప్లాంట్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు వచ్చాయి. ప్రమాదం కారణంగా కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సుమారు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు..
Post Views: 38