E-PAPER

పురుగుల బియ్యంతో వంట ఎట్లా చేసేది.?

పెండింగ్ లో ఉన్న నాలుగు నెలల బిల్లులు వేతనాలు వెంటనే చెల్లించాలి.

ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 10 వేల రూపాయల వేతనాన్ని అమలు చేయాలి.

దాసరి రాజేశ్వరి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం (సి ఐ టి యు)
జిల్లా అధ్యక్షురాలు.

కాసిపేట,డిసెంబర్26 వై 7 న్యూస్;

కాసిపేట మండలం దెవాపూర్ లో ఎం డి ఎం కార్మికుల సమావేశంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం (సి ఐ టి యు)
జిల్లా అధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి మాట్లాడుతూ,పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు వండి పెడుతున్న బియ్యం ముక్కిపోయి,పురుగులు పట్టి ఉన్న అధికారులు సివిల్ సప్లై ద్వారా సరఫరా చేస్తున్నారని,భోజనం చేసే పిల్లలు అనారోగ్యానికి గురైతే అధికారులే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియజేసారు.
అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు గత 4 నెలలుగా బిల్లులు, వేతనాలు రాకపోవడం మూలంగా అప్పుల పాలై వంట నిర్వహణ చేయడం కోసం మరిన్ని అప్పులు చేయడం జరుగుతుందని,వెంటనే బిల్లులు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేసారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే 10 వేల రూపాయల వేతనం,ఇతర సమస్యలు పరిష్కారం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, సంవత్సరం గడిచిన నేటికీ అమలు చేయ్యడం లేదని,పైగా మధ్యాహ్న భోజన కార్మికులపైన రోజు రోజుకు బారాలను వేస్తుందని,గత ప్రభుత్వం వ్యవరించిన తీరే ఈ ప్రభుత్వం కూడా వ్యవరిస్తుందని అన్నారు.
ఇచ్చిన హామీలను అమలు జరపకపోతే రాబోయే కాలంలో పోరాటాల సిద్ధమవుతావని ఈ సందర్భంగా ప్రభుత్వానికి,అధికారులకు తెలియజేసారు.ఈ సమావేశంలో గురువక్క,కనక దేవేంద్ర,కోట్నాక సాంద్రుబాయి,
సాయక్క,అంకమ్మ,మణెమ్మ,కమలాబాయి,
పోషక్క తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!