ఇబ్బంది పడుతున్న అంబేద్కర్ కాలనీ ప్రజలు
అధికారులు స్పందించకపోతే జనవరిలో ఉద్యమం మొదలు పెడతాం అంటున్న నాయకులు
చంద్రుగొండ,డిసెంబర్26 వై 7 న్యూస్ తెలుగు;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం చంద్రుగొండ మండలంలో గల అంబేద్కర్ కాలనికి చెందిన దళిత సోదరులకు,ఎవరైన మరణిస్తే దహన సంష్కరణకు స్మశాన వాటికకు తీసుకువెళ్లడానికి దారి లేక ఇబ్బందులు పడుతున్నారని సామాజిక మాధ్యమాల్లో తెలుసుకొని నేడు ఆదివాసీ నాయుకులు తంబర్ల రవి చంద్రుగొండలో ఉన్న బీజేపీ, టీడీపీ పార్టీ నాయకులతో కలిసి దళిత సోదరులను కలుపుకొని స్మశానానికి వెళ్లే దారిని పరిశీలించారు,ప్రభుత్వాలు మారుతున్న పేదల బతుకులు మారడం లేదని ఎంతోమంది అధికారులకు ఎన్నోసార్లు వినతిపత్రం ఇచ్చిన కూడా స్పందన లేకపోయిందని,ధీనిపై మంత్రులు,స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోతే కలిసొచ్చే పార్టీలతో కలిసి పార్టిలకతీతంగా జనవరిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు,ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు గుగులోత్ శ్రీనివాస్ నాయక్,కోడెం నాగేశ్వర్రావు, టిడిపి మండల మహిళా నాయకురాలు డా:విజయలక్ష్మి , మండల అధ్యక్షులు సత్యనారాయణ ,వెంకటేశ్వరరావు (బుజ్జి),దళిత సంఘాల నాయకులు లక్ష్మీనారాయణ,విజయ్ తదితరులు పాల్గొన్నారు.