బూర్గంపాడు,డిసెంబర్17 వై 7 న్యూస్;
బూర్గంపాడు సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం సారపాక కార్యాలయంలో పాపినేని సరోజన అధ్యక్షతన జరిగిన సమావేశానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి పాల్గొని
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అన్నారు.మహిళలకు బస్సు ఫ్రీగా అనేది తప్ప బస్సుల్ని పెంచలేదని మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారని, బస్సులో మహిళలు జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు.2500 ప్రతి మహిళలకు నెలకి ఇస్తాన న్నది అమలు చేయలేదని, ఉపాధి కార్మికులకు 12000 ఇస్తానీ అమలు కాలేదని,ఆడపడుచులకు తులం బంగారం ఇస్తానన్నారు అది ఇవ్వలేదని,
కౌలు రైతులకు 12000 ఇస్తానన్నారు అది అమలు చేయలేదని, రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేయలేదని,ఇంద్రమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి సర్వే చేసి నిరుపేద కుటుంబాలకి పారదర్శకంగా అందే విధంగా చూడాలని అన్నారు.4000 పింఛన్ దారులకు ఇస్తానని అమలు చేయలేదు వికలాంగులకు 6000 ఇస్తానని అది అమలు కాలేదు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో ప్రజలతో పెద్ద ఎత్తున రానున్న కాలంలో పోరాటాలు ఉద్యమాలు చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు
మండల కమిటీ సభ్యులు భయ్యా రాము, పాండవుల రామనాథం, SKఅబిదా, గుంటక కృష్ణ, తదితరులు పాల్గొన్నారు









