సింగరేణి కాంట్రాక్టు కార్మికుల శ్రమను, అగ్రిమెంట్ అంశాలను గుర్తించి, అమలు చేయాలి
గట్టు మహేందర్ ,సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు డివిజన్ కార్యదర్శి
శ్రీరాంపూర్,కడిసెంబర్17 వై 7 న్యూస్
సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులపై వివక్షను, నిర్లక్ష్యాన్ని వీడి 18 రోజుల సమ్మె సందర్భంగా చేసిన అగ్రిమెంట్ అంశాలను అమలు చేయాలని, లేనియెడల డిసెంబర్ 23 సింగరేణి డే సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులందరూ నల్ల రిబ్బన్లు, జెండాలతో నిరసన తెలియజేయాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియు డివిజన్ కార్యదర్శి గట్టు మహేందర్ శ్రీరాంపూర్ ఓసిపి కాంట్రాక్టు కార్మికుల అడ్డా మీటింగ్లో కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గట్టు మహేందర్ మాట్లాడుతూ…
సింగరేణి యాజమాన్యం ఒకే కుటుంబం, ఒకే గమ్యం, ఒకే లక్ష్యం నినాదంతో ముందుకు పోతూ, ఆ నినాదంలో కాంట్రాక్టు కార్మికులను గుర్తించడంలో వివక్షను, సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది. సింగరేణి సంస్థ ప్రతి సంవత్సరం సాధిస్తున్న లాభాల్లో కీలక పాత్ర కాంట్రాక్టు కార్మికులది లేదా? అని ఈ సందర్భంగా యాజమాన్యాన్ని సిఐటియుగా ప్రశ్నిస్తున్నాం. 18 రోజుల సమ్మె సందర్భంగా లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన అగ్రిమెంట్ అంశాలను కూడా 2 సం”రాలు గడుస్తున్నా అమలు చేయడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది. అంతేకాకుండా కార్మికుల వేతనాలను పెంచడంలో కూడా సవతి తల్లి ప్రేమనే చూపిస్తూ, కాంట్రాక్టు కార్మికుల శ్రమను దోచుకుంటుంది. ఈ నెల 23న జరిగే సింగరేణి డే సందర్భంగా సింగరేణి యాజమాన్యం చేసిన అగ్రిమెంట్ లోని అంశాలను అమలు చేసి ,కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ,లేనియెడల నల్లజెండాలతో, రిబ్బన్లతో అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులు నిరసన తెలియజేయాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియుగా కార్మికులకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంపత్, సమ్మయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.