లైన్స్ క్లబ్ అధ్యక్షులు రామలింగేశ్వరరావు
భద్రాచలం,డిసెంబర్ 10 వై 7 న్యూస్ తెలుగు;
అనాధ వృద్ధాశ్రమాలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని లైన్స్ క్లబ్ అధ్యక్షులు చిట్టి నీడు రామలింగేశ్వర రావు కోరారు. మంగళవారం పట్టణంలోని కహల్ బాలుల ఆశ్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం ఆధ్వర్యంలో దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామలింగేశ్వర మాట్లాడుతూ శీతాకాలం నేపథ్యంలో గత నెల నుండి ఆశ్రమ పాఠశాలలలో విద్యార్థులకు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దుప్పట్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టామని గుర్తు చేశారు. లైన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు రూపొందించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇతర స్వచ్చంద సంస్థలు ప్రముఖులు సైతం కహల్ అనాధ బాలల ఆశ్రమాన్ని సందర్శించి వారికి అండగా నిలవాలని కోరారు. ప్రత్యేకించి మన జీవితాలలో జరిగే ప్రత్యేకమైన రోజులలో ఇటువంటి ఆశ్రమాలలో గడుపు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ కార్యదర్శి సీతారాంరెడ్డి లైన్స్ క్లబ్ సభ్యులు అనుకోజు నరసింహాచారి దాట్ల రాజు గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు ఉమా శంకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు









