E-PAPER

శోకసముద్రంలో పడమటి తండా

మృతులకు నివాళులర్పించిన పలువురు నేతలు

తిరుమలాయపాలెం డిసెంబర్ 6 (వై 7 న్యూస్ )

ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్డులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుమలాయపాలెం మండలం పడిమడ తండాకు చెందిన గుగులో త్ శివరాజు మూడు హర్షవర్ధన్ అనే విద్యార్థులు మృతి చెందారు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిమిత్తం మించిన వారి మృతదేహాలను తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాల ఇన్చార్జి తంబూరు దయాకర్ రెడ్డి వారి మృతదేహాలను సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు
బతుకుతెరువులలో వెలుగులు నింపుతారని ఆశపడిన కుటుంబాలలో ఆరిపోయిన దీపాల లాగా ఆ రెండు కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయినాయి నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంతో ఆశతో తమ పిల్లలు ఇంటికి తిరిగి వస్తారు అనుకున్న తరుణంలో రోడ్డు ప్రమాదంలో ఇలా నా బిడ్డలు విగత జీవిలుగా మా ఇంటికి తిరిగి వస్తారని అనుకోలేదని వారు తమ రోదనని వినిపిస్తున్నారు తమ కళ్ళ ముందు ప్రతిరోజు కళకళలాడుతూ తిరుగుతుండే తమ పిల్లలు ఈ అకాల మృత్యువుతో తమ కుటుంబాలలో ఇంత విషాదం మిగులుస్తారని మేము కలలో కూడా ఊహించలేదని గ్రామస్తులు వాపోతున్నారు ఏ ఇంటిలో చూసినా మరణరోధనే ఆ ఇద్దరు పిల్లలు మరణ వార్త విన్న తండా ఒక్కసారిగా ఉలిక్కిపడి తమ పిల్లలకు ఏమైంది అని బోరుణ విలపించడం మొదలుపెట్టారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్ గుగులోతు రమేష్ భూక్య కోటి భూక్య సిమ్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News