వై 7ప్రతినిధి (కాకినాడ జిల్లా):
కాకినాడకు చెందిన ఆలీషా బార్జిల (పెద్ద పడవలు లేదా నౌకలు) తయారీ వ్యాపారవేత్త అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు పేర్కొన్నారు. తనకి పంపిన నివేదికలో కాకినాడ జిల్లా అధికారులు వివరించారని ఆయన తెలిపారు. ఇటీవల కాకినాడ వచ్చిన పవన్ పోర్టులో బియ్యం తనిఖీల సందర్భంగా ‘హూ ఈజ్ ఆలీషా’ అని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంభందించిన అధికారులు నివేదిక వివరాలను తెలియజేస్తూ ఉపముఖ్యమంత్రికి పంపారు. ‘కాకినాడ పోర్టులో ఆలీషా రెండెకరాలు లీజుకు తీసుకుని నౌకలు నిర్మిస్తున్నారని, ఒకప్పుడు ఆయిల్ స్మగ్లింగ్‌లో కీలక పాత్ర పోషించారని విన్నవించారు . ప్రస్తుతం ముంబైలో బార్జిలు/నౌకలు నిర్మిస్తున్నారరని, గతంలో ఆయిల్ మాఫియాకు ఆయన గోదాములు ఇచ్చారని.. గత ప్రభుత్వంలో బార్జిల వ్యాపారంలో పైచేయిగా ఉండేలా చక్రం తిప్పారని, పలు రాష్ట్రాలతోపాటు దుబాయ్‌లో ఆస్తులు పోగేశారని రిపోర్టులో ప్రస్తావించారు. కాగా.. ఆలీషాకు బియ్యం వ్యాపారాలు ఉన్నాయన్న అనుమానంతో పవన్ ఆరా తీయగా.. అధికారులు విచారించి ఆయనకు అసలు బియ్యం వ్యాపారమే లేదని తేల్చారన్నారు.









