జుక్కల్ డిసెంబర్ 1వై 7న్యూస్ తెలుగు
జుక్కల్ నియోజకవర్గం
బిచ్కుంద మండల కేంద్రంలోని స్థానిక సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు శీతాకాలం పురస్కరించుకొని విద్యార్థులకు స్వచ్ఛందంగా తన తల్లి జ్ఞాపకార్థంగా పెద్ద కొడపుగల్ మండలఎం కాటేపల్లి గ్రామానికి చెందిన ఓ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో రగ్గులు కంబళ్ళుపంపిణీ తన తన కుటుంబ ఔన్నత్యాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే పెద్ద కోడపుగల్ మండల పరిధిలోని కాటేపల్లి గ్రామానికి చెందిన పానుగంటి హనుమాన్లు వృత్తిపరంగా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ పనులను చేపడుతున్నట్లు తన తల్లి అయినటువంటి పానుగంటి పెంటమ్మ జ్ఞాపకార్ధంగా పోరుగు మండలమైన జుక్కల్ తోపాటు ఖండేబల్లూర్ గ్రామ లో ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు దుప్పట్లను పంపిణీ చేయడంతో పాటు తన వంతు చేదోడు వాదోడు సహాయంగా నోట్ బుక్కులు పెన్నులను అందించి అనంతరం బిచ్కుంద మండల కేంద్రంలోని స్థానిక సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు అందించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్పల్లి గంగాధర్ మాట్లాడుతూ పేద విద్యార్థుల అభ్యున్నతిని గుర్తించి వారికి చేదోడు సహాయంగా ముందుకు వచ్చి స్వచ్ఛంద సేవకు ముందు ఉండడం అభినందించదగ్గ విషయమని తమ ప్రభుత్వ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలను చేపడుతున్న క్రమంలో ఇలాంటి స్వచ్ఛంద సేవకుల రూపంలో వచ్చిన దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందించడం గొప్ప విషయం అని కొనియాడారు ఈ సందర్భంగా కాటేపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ మొగుల గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పలు సంక్షేమ పథకాల విషయంలోనూ అదే విధంగా పార్టీకి మంచి పేరు వచ్చేలా సంక్షేమ కార్యక్రమాల కోసం తమవంతుగా స్వచ్ఛందంగా సహకారాలను అందించడానికి సిద్ధంగా ఉన్నామని స్వచ్ఛంద సహకారాలకు ఎల్లప్పుడూ ముందుంటామని పార్టీ ఆధ్వర్యంలోను పలు సందర్భాల్లో పలు సేవలు కార్యక్రమాలు చేపట్టినట్లు ఇకముందు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ చేదోడు వాదోడుగా ప్రభుత్వానికి అండగా ఉంటూ తాము ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చూస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బిచ్కుంద గ్రామ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు సాయి నీ అశోక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధర్పల్లి గంగాధర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోతుల లింగారాం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు భోగాడ మీద సాయిలు ఉమ్మడి జిల్లా అభివృద్ధి ప్రణాళిక సంఘం డైరెక్టర్ నౌష నాయకలతో పాటు మైనారిటీ నాయకులు ఖలీల్ ముజీబ్ మునీర్లతోపాటు బిచ్కుంద మాజీ వార్డ్ మెంబర్ సాయిని బసవరాజ్ కాంగ్రెస్ పార్టీ దండోరా నాయకులు శాఖాపూర్, తుకారాం తదితరులు పాల్గొన్నారు.