కోటగిరి నవంబర్ 29 వై న్యూస్ తెలుగు
గుండెపోటుతో లెక్చరర్ మృతి చెందిన ఘటన కోటగిరి మండలంలోని జూనియర్ కళాశాలలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కోటగిరి జూనియర్ కళాశాలలో జువాలజీ లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్న గోవర్ధనగిరి (49) విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో స్థానిక సిబ్బంది హుటాహుటిగా ఆస్పత్రి కి తరలించారు. కానీ మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. గోవర్ధన్ గిరి నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి కోటగిరి జూనియర్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నారు.
Post Views: 93









