మున్సిపల్ చైర్ పర్సన్ మామిళ్ళ జ్యోతి కృష్ణ
తూప్రాన్, నవంబర్ 29 వై సెవెన్ న్యూస్
తూప్రాన్ పురపాలక సంఘ పరిధిలో తూప్రాన్ పట్టణ ప్రజల సేవ, ఆరోగ్యమే ప్రథమ విధిగా భావిస్తూ 16వ వార్డు,1వ కల్లు కాంపౌండ్ దగ్గర డ్రైనేజీ సరిగ్గా లేక అనేక సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నదున ప్రజల సౌకర్యార్థం కొత్త మోరిని పనులను మరియు 15వ వార్డ్ యందు ప్రజల కోరిక మేరకు మోరి పై పైకప్పును పనులను ,16 వ వార్డు యందు కొత్త సిసి రోడ్ పనులను పరిశీలించిన తూప్రాన్ మున్సిపల్ చైర్పర్సన్ మామిండ్ల జ్యోతి కృష్ణ ముదిరాజ్, మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి. కౌన్సిలర్లు పల్లెర్ల జ్యోతి రవీందర్ గుప్తా,శ్రీశైలం గౌడ్ గార్లతో కలసి పనులను పరిశీలించి నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా పనులను చేపట్టాలని కాంట్రాక్టర్ కి సూచించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ శ్రీకాంత్ కాంగ్రెస్ నాయకులు,కాలనీవాసులు ప్రజలు పాల్గొనడం జరిగింది.









