యువకులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది
శివ్వంపేట,నవంబర్ 29 వై సెవెన్ న్యూస్
యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన శివ్వంపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది,శివ్వంపేట ఎస్ ఐ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన సుక్క కృష్ణ చిన్న కుమారుడు సుక్క స్వామి ప్రదీప్ (18),శుక్రవారం ఉదయం ఇంట్లోని బాత్రూం లో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు కమ్ముకున్నాయి,పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం సుక్క స్వామి ప్రదీప్ తూప్రాన్ లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు అని గతంలో తన తలకు గాయం కావడంతో బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందని దానివల్ల అతడు అప్పుడప్పుడు డిప్రెషన్ లోకి పోతుంటాడని,శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నట్టు వారి తండ్రి సుక్క కృష్ణ ఫిర్యాదు చేసిండు అని,కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నమని తెలిపారు,