దీక్ష దివాస్ పేరుతో బిఆర్ఎస్ దొంగ దీక్షలు
మండల పార్టీ అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్
సిద్దిపేట నవంబర్.29 వై సెవెన్ న్యూస్
నీళ్లు నిధులు నియామకాలు అనే ఉద్దేశ్యం తో ఏర్పాటైనా తెలంగాణ రాష్ట్రన్ని తమ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణను సంపదను దోచుకున్న దొరల పాలనకు తెలంగాణ ప్రజలు విముక్తి పలికారన్నారు ఈ సందర్బంగా చిన్నకోడూరు మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో మండల పార్టీ అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ జీర్ణించుకోలేక బిఆర్ఎస్ నాయకులు దీక్షా దివస్ పేరుతో దొంగ దీక్షలు చేయడం సిగ్గుచేటన్నారు అధికారం లో వున్నప్పుడు దొరఅహకారంతో ఒక నయ నిజాంలాగా ప్రవర్తిస్తూ ప్రశ్నించే గొంతుకలమీద అక్రమకేసులు బానాయించరన్నారు ఉద్యమాల నుండి పుట్టిన పార్టీ అని గొప్పలు చెప్పుకునే బిఆర్ఎస్ నాయకులు వారు అధికారం లో ఉన్నప్పుడు మాత్రం ధర్నా చౌక్ ఎత్తి వేసి కనీసం నిరసన తెలియజేయకుండా చేసిన దొంగలు ఇప్పుడు దీక్షదివాస్ పేరు తో దొంగ దీక్షలు చేసి ప్రజలనుమభ్యపెట్టాలని చూస్తే ప్రజలే బిఆర్ఎస్ పార్టీ ని పాతాళనికి తొక్కుతారన్నారు అదేవిధంగా ప్రజా పాలన ఆరు గ్యారంటీల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వనికి ప్రజల్లో పెరుగుతున్న ఆధారణ చూసి జీర్ణించుకోలేక ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు అంతే కాకుండా కేసీఆర్ చేసిన దొంగ దీక్షల వల్ల కెసిఆర్ దొర కుటుంబం ప్రాణ త్యాగాలు చేస్తేనో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగలేదని ఈ దొరలు రెచ్చ గొట్టి ఎందరో విద్యార్థుల బలిధానాల వల్ల అప్పుడున్న కాంగ్రెస్ మంత్రులు పదవులు సైతం త్యాగం చేసి ఎంపీ లు ముఖ్యంగా రవాణా మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ పార్లమెంట్ లో ఆంధ్ర ఎంపీ లతో కొట్లాడి అప్పటి ఆంధ్ర ఎంపీ లగడపాటి చేసిన పెప్పర్ స్ప్రే దాడిని కూడా ఎదుర్కొని మరియు ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజానర్సింహా అప్పటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉపముఖ్యమంత్రి హోదాలో సిడబ్ల్యుసిసమావేశం లో ఏకాదాటిగా నాలుగు గంటల పాటు తెలంగాణ వాదిగా తెలంగాణ కు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి ఒప్పించి మరి 4 కోట్ల జనాభా 60 ఏండ్ల తెలంగాణ రాష్ట్ర కళ సహకారమయ్యేలా సోనియా గాంధీ ఒప్పించారు తప్ప పార్లమెంట్ లో ఏక లింగం గా వున్నా అప్పటి తెరాస ఎంపీ కేసీఆర్ వల్ల తెలంగాణ ఏర్పాటు జరగలేదని విమర్శించారు ఈ *కార్యక్రమం లో మండల ఉప అధ్యక్షులు సందబోయిన పర్శరాం, మండల ఎస్సీ సెల్ కన్వీనర్ కొమ్ము ప్రశాంత్, జిల్లా నాయకులు మంత్రి సురేందర్ నేత నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు









