సాధన చేస్తే వచ్చేది ఆరోగ్యం
గోల్డ్ మాన్ సూర్య భాయ్
షాద్ నగర్ నవంబర్.29 వై సెవెన్ న్యూస్
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం లోని న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్ అధ్యర్యంలో కుంగ్ ఫు అకాడమీ విద్యార్థులు హైదరాబాద్ఓల్డ్ సిటీ గోల్డ్ మాన్ సూర్య భాయ్ నీ కలిశారు.ఈ సందర్బంగా మాస్టర్ అహ్మద్ ఖాన్ వారిని శాలువా, పూలమాల తో సత్కరించారు. ఈ సందర్బంగా సూర్య భాయ్ మాట్లాడుతూ నిత్యం ఊరుకుల, పరుగుల జీవిత ప్రయాణం లో మానసిక ఒత్తిడి తట్టుకోవడం చాలా కష్టం తో కూడుకున్న పని. దానికి తోడు పెద్దలు, యువత, చిన్న పిల్లలు సెల్ ఫోన్ కు బానిసలై జీవితాన్నినాశనం చేసుకుంటున్నారు. నేడు మహిళలు, యువతులు ఎందరో అరాచక రాక్షసుల చేతిలో బలైపోతున్నారు. దీని నుండి బయట పడాలంటే ఒక్కటే మార్గం అది శారీరకంగా, మానసికంగా దృడంగా ఉండడమే. దానికి చేయవలసిందల్ల రోజు ఒక గంట కుంగ్ ఫు, కరాటే నేర్చుకోవడం. ఒక గంట సమయం కోట్ల విలువైన జీవితం దీనితో శారీరక బలం పొందవచ్చని అన్నారు. కుంగ్ ఫు, కరాటే నిత్యం ప్రాక్టీస్ చేస్తే బాడీ పోస్టర్ మరియు చురుకుదనాన్ని పొందవచ్చని అన్నారు. ఈ సందర్బంగా కుంగ్ ఫు విద్యార్థులకు తన ఇంట్లో భోజనాలు చేయించి వారితో కలిసి భోజనం చేశారు.