ఇంటికి ఒక మనిషి, ఊరికి ఒక వాహనం లో లక్షలాదిగా తరలిరండి
తెలంగాణలో మాలల దమ్మేంటో చూపిస్తాం
మాల జన సమితి అధ్యక్షుడు చెట్టి సురేష్
ఆశ్వాపురం నవంబర్29 వై సెవెన్ న్యూస్
అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,మాల జన సమితి పినపాక నియోజకవర్గ అధ్యక్షుడు చెట్టి సురేష్ ఆధ్వర్యంలో డిసెంబర్ ఒకటవ తారీఖు హైదరాబాద్ పరేడు గ్రౌండ్స్ లో జరిగే మాలల సింహగర్జన భారీ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ మతోన్మాద బిజెపి పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని సుప్రీంకోర్టు తీర్పులను కూడా తమ చెప్పు చేతల్లో పెట్టుకుని ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ పెట్టిన ఈ మాలల సింహ గర్జన బహిరంగ సభను తెలంగాణ రాష్ట్రంలో మాలలందరూ లక్షలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాక తెలంగాణ రాష్ట్రంలో మాలలు 30 లక్షల మంది ఉన్నారని ,దళితులు మధ్య చిచ్చుపెట్టే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తే మాత్రం దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలియజేశారు. భారతదేశంలో గానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో గాని మాలలతో పెట్టుకున్న ఏ రాజకీయ పార్టీకి కానీ రాజకీయ నాయకుడికి కానీ భవిష్యత్తు లేకుండా పోయారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. డిసెంబర్ ఒకటవ తారీకు హైదరాబాదులో జరిగే సింహ గర్జన ద్వారా మాలలు సింహం లాగా గర్జించే సమయం ఆసన్నమైందని మాలల జోలికొస్తే ఎవరైనా మట్టి కొట్టుకొని పోవాల్సిందే అని ఇప్పటికైనా దళితుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తెలియజేశారు. మాలల సింహ గర్జన బహిరంగ సభకు మహిళలు, విద్యార్థినీ విద్యార్థులు కవులు కళాకారులు, గాయకులు మాల మేధావులు ఉద్యమ నాయకులు లక్షలాదిగా తరలివచ్చి ఆ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రావుల వెంకటేశ్వర్లు, బత్తుల కిరణ్ జూపల్లి సుశీల కాలవ వనజాక్షి , చెట్టి కుమారి తదితరులు పాల్గొన్నారు.









