సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమంలో జగ్గంపేట సిఐ వైఆర్ కే
కాకినాడ, నవంబర్23 వై7 న్యూస్ ప్రతినిధి
నేరాలు జరుగక మునుపే ప్రజలు జాగ్రత్తలు తీసుకునేలా శనివారం జగ్గంపేట సిఐ వైఆర్ కే సమక్షంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా, గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామంలోని, ఆదిత్య యూనివర్సిటీ నందు గండేపల్లి ఎస్ఐ యు వి.శివ నాగబాబు ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ అవగాహన సదస్సులో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న వివిధ రకాల సైబర్ నేరాలు వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సంబంధించిన వీడియోలు, మరియు సైబర్ క్రైమ్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లను ప్రదర్శించి, సదస్సుకు హాజరైన విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులలో యుక్త వయస్సులో జరిగే పరిణామ క్రమంలో, గుడ్ టచ్,”బ్యాడ్ టచ్ , స్వీయ రక్షణ, బాల్య వివాహాలు, తెలియని వయసులో ప్రేమ, ఆకర్షణ, సోషల్ మీడియాలో పరిచయాలు, ఆన్లైన్ వేధింపులు, ప్రేమ పేరుతో వలవేసి చేసే ఆర్థిక, శారీరక, మానసికంగా ఇబ్బందులు, మహిళలపై జరుగుతున్న నేరాలు, ఈవ్ టీజింగ్, మరియు చట్టాలపై కూడా విద్యార్థినులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్లు బారిన పడకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని, అవగాహన తోనే సైబర్ నేరాల బారిన పడకుండా ఉండగలమని, కావున ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అవగాహన ఏర్పరచుకొని సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అనంతరం సైబర్ నేరాల పై అవగాహన వీడియోలను వాట్సప్ ద్వారా షేర్ చేశారు. సదరు వీడియోలను సోషల్ మీడియా వేదికగా ప్రజలకు చేర్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
సైబర్ నేరాల పై రిపోర్ట్ కొరకు సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 సంప్రదించాలన్నారు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే హెల్ప్ లైన్ నెంబర్ 1930కి , సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (cybercrime.gov.in) లో నమోదు చేయండి. విద్యార్థిని,విద్యార్థులంతా నిషేధిత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు.ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు.









