రిటైర్ అయిన సింగరేణి కార్మికులకు 18.27 కోట్ల రూపాయల దీపావళి బోనస్
ఈనెల 27న కార్మికుల ఖాతాల్లో జమ కానున్న బోనస్ సీఎండీ ఎన్.బలరామ్ వెల్లడి
సింగరేణి భవన్, నవంబర్ 23, 2024
సింగరేణి సంస్థలో 2023- 24 ఆర్థిక సంవత్సరంలో మరియు ఏప్రిల్ 1, 2024 నుంచి అక్టోబరు 24, 2024 మధ్యలో పనిచేసి రిటైర్ అయిన కార్మికులకు సంబంధించిన పర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డు స్కీమ్( దీపావళి బోనస్) సొమ్మును విడుదల చేస్తున్నామని, ఈనెల 27వ తేదీన వారి ఖాతాల్లో బోనస్ సొమ్ము జమ అవుతుందని సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ శనివారం నాడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రిటైర్ అయిన 2,754 మంది కార్మికులకు దీపావళి బోనస్ కింద ఒక్కొక్కరికి గరిష్టంగా 93, 750 రూపాయలు చొప్పున మొత్తం 18 కోట్ల 27 లక్షల రూపాయలను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నెల 27న రిటైర్డు కార్మికుల ఖాతాల్లో జమ చేయడానికి తగు ఏర్పాట్లు చేయాలని ఆయన ఆర్థిక , సిబ్బంది వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.









