E-PAPER

మనోహరాబాద్ హత్య కేసును ఛేదించిన పోలీసులు

తూప్రాన్ నవంబర్22 వై సెవెన్ న్యూస్

తూప్రాన్ సర్కిల్ పరిధిలోన మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కళ్ళకల్ గ్రామంలో తేదీ 16 నవంబర్ రోజు శనివారం రాత్రి సమయంలో ప్రమోద్ కుమార్ పాశ్వాన్ అనే వ్యక్తి హత్యకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు.
కాలకల్ గ్రామంలో శ్రీరామ్ పాండరీ అనే వ్యక్తి ఒక గృహం నిర్మానించే క్రమంలో ప్రమోద్ పాశ్వాన్ గుత్తిదారుకు ఇవ్వడం జరిగింది. ప్రమోద్ పాశ్వాన్ బిట్టు కుమార్ మరియు అతని భార్యను పనిలో పెట్టుకున్న క్రమంలో చనిపోయిన వ్యక్తి ప్రమోద్ పాశ్వాన్ మరియు బిట్టు కుమార్ అతని భార్య పూజ ఉండడం అదే ఇంటి లో ఉండడంతో కొన్ని రోజుల నుంచి ప్రమోద్ పాశ్వాన్ అనే వ్యక్తి బిట్టు కుమార్ యొక్క భార్య అయినటువంటి పూజతో అసభ్యంగా ప్రవర్తించడం చేస్తున్నాడని బిట్టు కుమార్ బీహార్ సంబంధించిన వ్యక్తికి కోపం వచ్చి అక్కడ ఉన్న కట్టెతో కొట్టి ఛాంపినాడు అని పోలీసుల దర్యాప్తులో తేలడంతో బిట్టు కుమార్ అనే వ్యక్తి పట్టుకొని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తూప్రాన్ సి.ఐ రంగా మీడియా ప్రకటనలో తెలిపారు. కేసు ను ఛేదించిన మనోరబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ మరియు ఐడి పార్టీ సిబ్బంది గోవర్ధన్, శ్రీనివాస్ రాథోడ్, కృష్ణ కానిస్టేబుళ్లను అభినందించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News