తల్లి శునకం రోదిస్తున్న తీరును చూసి కంటతడి పెట్టిన గ్రామస్తులు.
తల్లి పాలు ఇస్తుండగా ఘటన.!!
అతివేగమే కారుణ మంటున్న స్థానికులు..
తిరుమలాయపాలెం నవంబర్ 22 వై 7న్యూస్;
కొన్ని ప్రైవేటు పాఠశాలలకు సరైన అనుమతులు లేకుండా అధికారుల అన్నదండలతో పాఠశాలలు నిర్వహిస్తుంటారు. ఆ పాఠశాలలోని పిల్లలకు కావలసిన ఏ ఒక్క సౌకర్యం సక్రమంగా ఉండకపోయినా డబ్బే ప్రధానంగా పాఠశాల నిర్వర్తిస్తుంటారు. ఏదో సెకండ్ హ్యాండ్ వాహనాలు తెచ్చి, ఫిట్నెస్ లేకున్నా ఉన్నట్టుగా చూపెట్టి, అనుభవం లేని డ్రైవర్లను పెట్టి పాఠశాలలు నిర్వర్తిస్తుంటారు. ఇలాంటి పాఠశాల యజమానుల నిర్లక్ష్యం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రాణాలు పోతూనే ఉంటాయి. అలాంటి సంఘటనే ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం లో ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకుంది. పాఠశాల కు సంబంధించిన వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యానికి కళ్ళు తెరవని మూడు సునకాలు మృతి చెందాయి. పాఠశాలలోనే పిల్లలను ఎక్కించుకునేందుకు వెళ్లిన పాఠశాల వ్యాన్ డ్రైవర్ అతివేగానికి పాలు తాగుతున్న మూడు కుక్కపిల్లలు మృతి చెందాయని, గమనించిన గ్రామస్తులు వ్యాన్ డ్రైవర్ని అడ్డుకోగా ఆపకుండా అతివేగంతో అక్కడ నుండి వ్యాన్ ఆపకుండా పారిపోయాడని గ్రామస్తులు తెలిపారు. అప్పటిదాకా పాలు త్రాగుతున్న పసి కూనలు ప్రాణం వదిలాయని తెలిసి, ఆ తల్లి శునకం ఏడుస్తుంటే గ్రామస్తులు కన్నీటి పర్వంతమయ్యారని, అదే సమయంలో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఆ డ్రైవర్ అలానే వెళ్లేవారని గ్రామస్తులు ఆగ్రహంతో ఆ పాఠశాలలకు వెళ్ళగా, ఆ పాఠశాల యజమాని తప్పయిందని, ఈ విషయాన్ని బయట తెలవనియొద్దని, కొందరిని వేడుకున్నట్టు తెలుస్తుంది.
అందరి ప్రాణాలు సమానమేగా.??
ఈ సృష్టిలో ప్రతి ప్రాణం గొప్పదే, కాకపోతే కొందరు జంతువుల ప్రాణాల కన్నా మనుషుల ప్రాణాలే గొప్పవి అనుకుంటారు. అందుకునే కొందరు జంతువుల ప్రాణాలను తేలికగా తీసిపారేస్తుంటారు. మరికొందరు జంతు ప్రేమికులు మనుషులతో సమానంగా జంతువులను ప్రేమిస్తూ పోషిస్తుంటారు. మనుషుల ప్రేమ కన్నా జంతువుల ప్రేమ ఎంతో గొప్పదని, కొన్ని కొన్ని సందర్భాల్లో అవి చూపెట్టే విశ్వాసాన్ని బట్టి చెప్పవచ్చు! మనుషులు విశ్వాసాన్ని మరిచినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో మనుషులకన్నా జంతువులే నయం అంటాం. జంతువుల్లోనూ శునకాలు (కుక్కలు) అంటే ఎంతో విశ్వాసాన్ని కలిగిన జంతువులని చెప్పవచ్చు! ఈ ప్రపంచంలో ఎక్కువగా సాధుకునే జంతువులు ఏమైనా ఉన్నాయంటే, అవి సునకాలే అని చెప్పొచ్చు! అంత విశ్వాసం కలిగిన జంతువులు కాబట్టే కొందరు వాటిని ప్రాణంగా సాదుకుంటారు.
సరైన ఆహారం దొరకక అలా వెంట పడతాయి
కొన్ని కొన్ని సందర్భాలలో శునకాలు మనసులపై వెంట పడటం చూస్తాం! అలా కొత్త మనుషులు కనపడినప్పుడు, లేదా ఆకలితో ఉన్నప్పుడు వాటికి ఆహారం కనబడినప్పుడే వెంట పడతాయి తప్ప, తెలిసిన మనసులు వచ్చినప్పుడు, వాటికి కడుపునిండా ఆహారం దొరికినప్పుడు మనుషుల జోలికి వెళ్ళవు! మనం మిగిల్చిన ఆహారాన్ని వాటికి పెడితే అవి కడుపునిండా తిని మన ఇంటికి కాపుల కాస్తాయి తప్ప మనుషులకు ఎటువంటి హాని చేయవు!!