E-PAPER

తెలంగాణ ప్రజలు నచ్చిన మెచ్చిన సినిమా కే.సి.అర్

తెలంగాణ ప్రజలు చూడదగిన సినిమా కే.సి.అర్

నవంబర్ 22న విడుదలైన కే.సి.అర్ సినిమా కు అనూహ్య స్పందన

హైదరాబాద్,నవంబర్, 22. వై సెవెన్ న్యూస్

తెలంగాణ ప్రజలు నచ్చిన మెచ్చిన సినిమా కే.సి.అర్ (కేశవ చంద్ర రామావత్) అని బి.అర్.ఎస్ రాష్ట్ర యూత్ విభాగం సీనియర్ నాయకులు సిందె చంద్రం అభిప్రాయం వ్యక్తం చేశారు. నవంబర్ 22 శుక్రవారం విడుదలైన సినిమా తెలంగాణ ప్రజలు చూడదగిన సినిమా కే.సి.అర్ చిత్రం అని అన్నారు. నవంబర్ 22న విడుదలైన కే.సి.అర్ సినిమా కు యావత్ తెలంగాణ రాష్ట్రంలో అనూహ్య స్పందన లభించిందని సిందే చంద్రం అన్నారు. కే.సి.అర్ చిత్రం గరుడవేగ అంజి దర్శకత్వంలో గ్రీన్ టీ ప్రొడక్షన్ లో రూపొందించిన కే.సి.అర్ చిత్రంలో జబర్దస్త్ ఫ్రేం రాకెట్ రాఘవ హీరో గా నటించి యావత్ తెలంగాణ ప్రజలను ఆలోచింప చేశాడు. అంతే గాకుండా కేవలం ఐదు రూపాయల చిక్క తో కడుపు నింపుకోవడానికి ఊరంతా తిరుగుతూ టిఫిన్, టీ దొరికక పొగా అదే ఐదు రూపాయల బిళ్ళ తో కడుపునిండా భోజనం చేసిన హీరో రాకెట్ రాఘవ ఇక్కడ అప్పటి సిఎం కేసీఆర్ అమలు చేసిన పలు పథకాలు ఐక్య రాజ్య సమితి లో శభాష్ అనిపించుకున్న రైతు భీమా, రైతు భరోసా లాంటి గురించి ఓపెన్ గా విషధీకరిస్తూ ప్రజల్లో చైతన్యం నింపిన హీరో మాటలకు జనం జేజేలు పలికారు. ఏ పల్లె పిల్లోడో – ఏ తల్లి కన్నోడి అనే పాట ప్రేక్షకులను కంట తడి పెట్టించింది. నాతల్లి తెలంగాణ మురిసిపోతుంది అనే పాటకు పరిపక్వత కలిగిన అభివృద్ధి సాదించిందనేందుకు నిదర్శనం అని తెలిపారు. రక్తంతో తడిసిన నేలమ్మా నీవు రాబందుల చేతిలో బంది అయినావనే పాట ప్రేక్షకులను అలరించింది. ఈ కే.సి.అర్ సినిమా కు లిరిక్స్ ను గోరేటి వెంకన్న, కాసర్ల శ్యాం అందించగా మ్యూజిక్ చరణ్ అర్జున్, ఎడిటర్ గా మధు, పి.అర్.ఓ గా వంశీ శేఖర్,ఆర్ట్స్ బంతుల మహేష్ వహించగా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ధియేటర్ లలో విడుదలైన ఈ చిత్రం ను తెలంగాణ ప్రజలు ఆదరించి అభిమానించి చూసి తరించాలని పిలుపునిచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్