దళిత సంఘం రాష్ట్ర నాయకుడు అయ్యల సంతోష్ పిలుపునిచ్చారు
బాన్సువాడ నవంబర్ 22 వై సెవెన్ న్యూస్ తెలుగు
బాన్సువాడ పట్టణంలోని గెస్ట్ హౌస్ లో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో డిసెంబర్ 1న నిర్వహించే మాలల సింహ గర్జనకు తరలిరావాలని దళిత సంఘం రాష్ట్ర నాయకుడు అయ్యాల సంతోష్ పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం పట్టణంలో ఆవిష్కరించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై పోరాటానికి దళిత సంఘాలు ఏకతాటిపైకి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మాల మహానాడు డివిజన్ అధ్యక్షుడు మల్లూరు సాయిలు, నర్సింలు, చిన్న సంగయ్య, బాలసాయిలు, కృష్ణ, వినోద్, గైని సంపత్, బేగరి దత్తు, ప్రదీప్, దత్తు, జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 103









