ఎల్లారెడ్డి నవంబర్ 22 వై సెవెన్ న్యూస్ తెలుగు
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలోని అన్నసాగర్ గ్రామానికి చెందిన గడ్డ లక్ష్మణ్ నిన్నటి రాత్రి హాసన్ పల్లి గ్రామం వద్ద ద్విచక్రవాహనం పై నుండి క్రింద పడి గాయాలయ్యాయి.
విషం తెలుసుకున్న వెంటనే మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ నిన్న రాత్రి ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని నాగేశ్వర రావు హాస్పిటల్లో ఉన్న బాధితుడిని పరామర్శించి మనోధైర్యం కల్పించారు.అలాగే ఆసుపత్రి సిబ్బందితో, నాగేశ్వర రావు తో బాధితుడి గడ్డ లక్ష్మణ్ పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని బాధితుడి బీద కుటుంబం, ఆర్థిక పరిస్థితి గురించి వివరించారు.అలాగే డాక్టర్ నాగేశ్వర రావు ని మెరుగైన వైద్యం అందించాలని కోరడం జరిగింది.ఆయనతో పాటు మాజీ జడ్పీటీసీ సామల్, తిమ్మారెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎల్లారెడ్డి మండల యూత్ ఉపాధ్యక్షులు కిరణ్, అన్నసాగర్ యూత్ ఉపాధ్యక్షులు మహేష్ తదితరులున్నారు.









