మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
దారస్ సాయిలు సీనియర్ నాయకుడు విట్టల్ గురూజీ
మద్నూరు నవంబర్ 22 వై సెవెన్ న్యూస్ తెలుగు
జుక్కల్ ఎమ్మెల్యే విద్యావంతుడు, జుక్కల్ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని మద్నూర్ మార్కెట్ కమిటీ ఎంపికలో ఎమ్మెల్యే చేపట్టిన విధానం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షి, రాష్ట్ర ప్రముఖులు ఎమ్మెల్యే పనితీరుపై అభినందిస్తున్నారు. జుక్కల్ నియోజవర్గంలో పార్టీ వ్యతిరేక శక్తులు చేస్తున్న దుర్మార్గపు చర్యలను కుట్రను తిప్పి కొట్టడానికి పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నామని, ముఖ్యమంత్రి అభినందనకు మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చిత్రపటానికి మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు దారస్ సాయిలు అలాగే పార్టీ సీనియర్ నాయకులు విట్టల్ గురూజీ మాట్లాడుతూ రాజకీయ వ్యభిచారాలు రాసలీలలు పనికిమాలిన వారు జుక్కల్ ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు చేయడంలో నిజం లేదని అన్నారు. నూతన విధానంతో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎంపిక చేసిన ఎమ్మెల్యే పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వం అభినందిస్తుందని, ఎమ్మెల్యే మంచి విద్యావంతుడని ఈ నియోజకవర్గానికి అలాంటి వ్యక్తి రావడం పార్టీ వ్యతిరేక శక్తులు అసత్య ఆరోపణలు చేస్తూ రాష్ట్ర హైకమాండ్ కు ఫిర్యాదు చేసిన దాంట్లో ఎలాంటి నిజం లేదని అన్నారు. కరకాండంగా నాయకులు ఆ దుష్ట శక్తులను దింపి కొట్టేందుకు పార్టీ సిద్ధంగా ఉందని మండల శాఖ హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సాయిలు, విట్టల్, గురూజీ, హనుమాన్లు, రామ్ పటేల్, కొండ గంగాధర్, వ ట్నాల, హనుమంతు యాదవ్, అమూల్, జావిద, సంతోష్ మేస్త్రి, దిగంబర్, రాథోడ్ రవి, సురేష్ ,సాయిలు, తదితరులు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.









