హాజరైన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి, ఎలక్షన్ రెడ్డి
తూప్రాన్, నవంబర్, 21. వై సెవెన్ న్యూస్
తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని అయ్యప్ప దేవాలయం వద్ద గురువారం ఉదయం సిసి రోడ్ మరియు ఐ మాస్ లైట్స్ ను గజ్వేల్ మాజీ శాసనసభ్యులు ప్రస్తుత సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి, తూప్రాన్ మున్సిపల్ చైర్ పర్సన్ మామిండ్ల జ్యోతి కృష్ణ ముదిరాజ్ కలిసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ప్రజా పరిపాలనలో భాగంగా తూప్రాన్ పట్టణానికి నూతన కోర్టు మంజూరు ఉత్తర్వులను ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ కౌన్సిలర్లు కొడిప్యాక నారాయణ గుప్త, జిన్న భగవాన్ రెడ్డి, శ్రీశైలం గౌడ్, బాణాపురం రాజు చింత రవీందర్ రెడ్డి, కుమ్మరి రఘుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గడప దేవేందర్, నాగులపల్లి వెంకటరెడ్డి, బజారు విశ్వరాజ్, మహేందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, బొల్లునాగులు, షరీఫ్, దుర్గం నాగేష్, అజర్, షారుక్, మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజు, అయ్యప్ప ఆలయ కమిటీ గురుస్వాములు చిన్న లింగు శ్రీనివాస్ గౌడ్ గురుస్వామి, బజారు రూపేష్ గురుస్వామి, తిమ్మాపురం నరసింహులు గురుస్వామి, మరియు అయ్యప్ప మాలదారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









