E-PAPER

20న సిపిఐ ఎం భద్రాచలం పట్టణ మహాసభ

హాజరుకానున్న రాష్ట్ర జిల్లా నాయకత్వం

గడ్డం స్వామి పట్టణ కార్యదర్శి

భద్రాచలం, నవంబర్ 18 వై 7 న్యూస్ తెలుగు

భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఐ ఎం భద్రాచలం పట్టణ ఎనిమిదోవ మహాసభ ఈనెల 20న పట్టణంలోని గుప్త కన్వెన్షన్ లో జరుగుతుందని పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి తెలిపారు. సోమవారం స్థానిక చందర్రావు భవనంలో జరిగిన పట్టణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాగణంలో జరగనున్న ఈ మహాసభకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మిడియం బాబురావు జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు ఏజే రమేష్ తో పాటు సీనియర్ నాయకులు యలమంచిలి రవికుమార్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలగని బ్రహ్మాచారి లు హాజరవుతున్నారని అన్నారు. గడిచిన మూడు సంవత్సరాల కాలంలో పార్టీ నిర్వహించిన పోరాటాలు సాధించిన విజయాల తోపాటు ఆటుపోటులపై చర్చించి భవిష్యత్తు లో చేయవలసిన పోరాటాలను ఈ మహాసభలలో కర్తవ్యాలుగా తీసుకుంటామని అన్నారు. 300 మంది ప్రతిదులు హాజరుకానున్న ఈ మహాసభ ఉదయం తొమ్మిది గంటలకు అమరవీరుల స్థూపం వద్ద జండా ఆవిష్కరణ నిర్వహించుకుని పట్టణంలో ప్రదర్శనగా మహాసభ ప్రాంగణానికి చేరుకొని అమరవీరులకు నివాళులర్పించి మహాసభను ప్రారంభిస్తామని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యురాలు సున్నం గంగా పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబు ఎర్రం శెట్టి వెంకట రామారావు పారిల్లి సంతోష్ కుమార్ నాదెండ్ల లీలావతి తదితరులు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News