E-PAPER

పోడు పట్టాలు వచ్చిన భూములకు వ్యవసాయ బోర్లు త్రి ఫేస్ కరెంటు లైన్ పర్మిషన్ ఇవ్వాలి

ఐటీడీఏ పిఓ కి వినతిపత్రం అందజేసిన టిఏజిఎస్ జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య

భద్రాచలం నవంబర్ 18 వై 7న్యూస్

తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి కి చర్ల మండలం సత్యనారాయణపురం గ్రామం సంబంధించిన 180 కుటుంబాలు సుమారు 500 ఎకరాల సాగులో ఉన్నాయని ఆదివాసీ పోడు రైతులు మాకు పట్టాలు అయితే వచ్చాయి గాని సరైన పంటలు వేసుకోవడానికి సాగు నీరు అందించడానికి అవకాశం లేదని ఆ భూములకు వ్యవసాయ బోర్లు మరియు త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఐటీడీఏ పీవో కి సోమవారం నాడు రైతులతో కలిసి వినతిపత్రం అందజేసిన టిఏజిఎస్ జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య. వారు మాట్లాడుతూ,ఆకాశం మీద ఆధారపడి పత్తి. మిర్చి వేస్తున్నాం అని అదేవిధంగా త్రీఫేస్ కరెంట్ సౌకర్యం. వ్యవసాయ బోర్లు పర్మిషన్ మీ గ్రామపంచాయతీలో గ్రామసభ జరిపి మీ సమస్యను పరిష్కారం చేస్తానని ఐటీడీఏ పీవో రాహుల్ హామీ ఇచ్చారని, అదేవిధంగా చర్ల మండలం విజయ్ కాలనీకి సంబంధించిన ఆదివాసి రైతులు రెవెన్యూ పట్టాలు 23 మందికి ఉన్నాయి కానీ సొంతంగా వ్యవసాయ బోర్లు మరియు త్రీఫేస్ విద్యుత్ లైన్ కు డిడి కట్టే అంతస్తోమత లేని కారణంగా మాకు మా భూములకు పంట బోర్లు త్రి ఫేస్ కరెంటు ఇచ్చి మమ్మల్ని ఆదుకోగలరని ఆ ఆదివాసి మహిళా రైతులు పివో ను కోరారు, సానుకూలంగా స్పందించిన పీఓ ఈ సమస్యను పరిష్కరిస్తాం అని అన్నారని తెలియజేసారు, ఈ కార్యక్రమంలో టీఏజీఎస్ భద్రాచలం పట్టణ కార్యదర్శి కుంజా శ్రీను, చర్ల మండలం ఐద్వా మండల కార్యదర్శి పొడుపుగంటి సమ్మక్క, ఆదివాసి రైతులు శ్యామల కాంతయ్య, పర్శిక రామ్ కిరణ్, గట్టుపల్లి సురేష్, సోడి నాగమణి ,సోయం రవి, కారం మహేష్, తెల్లం నాగేశ్వరావు, తుర్రం సమ్మక్క ఇంకా తదితరులు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!