E-PAPER

భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం

టేకులపల్లి,నవంబర్17 వై 7 న్యూస్
అతివేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి సింగరేణి వాహనాన్ని ఢీకొట్టిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి లో జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ కు చెందిన రోహిత్, కిరణ్, కీర్తి, ప్రవళిక, దీప్తి కలిసి హైద్రాబాద్ నుంచి భద్రాచలం వెళ్తున్నారు. మండల పరిధిలోని వెంకట్యాతండా మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న సింగరేణి వాహనాన్ని అతివేగంగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న వీరందరికీ తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ రోహిత్ పరిస్థితి విషమంగా ఉంది. టేకులపల్లి ఎస్సై పోగుల సురేష్ ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను 108 అంబులెన్స్లో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News