పెదపూడి,నవంబర్16 వై7 ప్రతినిధి ;
పెదపూడి మండలంలో బాలికల సంరక్షణ కొరకు ప్రతి పాఠశాలాలో మహిళా సంరక్షణ కొరకు పెదపూడి ఎస్.ఐ రామారావు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ ఆదేశాల ప్రకారం కాకినాడ డి.ఎస్.పి రఘువీర్ విష్ణు ఉత్తర్వులు ప్రకారం పెదపూడి ఎస్సై రామారావు మహిళా రక్షక టీం తో పెదపూడి మండలం, మామిడాడ గమ్యం స్కూల్లో మహిళా రక్షణ – చట్టాలు వాటిపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్.ఐ. రామారావు మాట్లాడుతూ కొంతమంది యువకులు మహిళలపై అసభ్య ప్రవర్తన మానుకొని, ప్రతి మహిళను తోబుట్టువులు చూసుకోవాలని పేర్కొన్నారు. మహిళా భద్రత విషయంలో నూరు శాతం భద్రత అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ శివారెడ్డి,జి ఎం ఎస్ కే, గమ్యం స్కూల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 105