E-PAPER

రాష్ట్ర అడవి అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ను కలిసిన గురిజాల గోపి.

కష్టపడ్డ వారిని పార్టీ గుర్తు పెట్టుకుంటుంది. పొదెం వీరయ్య.

మణుగూరు, నవంబర్ 14 వై 7 న్యూస్ : రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పోదేం వీరయ్య ను గురువారం తన చాంబర్ లో మణుగూరు పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ జిల్లా నాయకులు గురజాల గోపి మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పోదేం వీరయ్య తో కొంతసేపు ముచ్చటించారు. పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, బలోపేతం గురించి ముచ్చటించినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు గురజాల గోపి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ స్పందిస్తూ.. భవిష్యత్తు చాలా ఉంది రానున్న రోజుల్లో మీకు కాంగ్రెస్ పార్టీ లో గుర్తింపు వస్తుందని తద్వారా సముచిత స్థానం కూడా లభిస్తుందని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే పార్టీ పిలుపు మరకు ఏ ఎన్నికలు వచ్చిన బే షజాలకు వెళ్లకుండా అందర్నీ కలుపుకుపోయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించిన వారిని గుర్తుపెట్టుకుంటుందని తెలియజేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు. గురజాల గోపి వెంట కార్యకర్తలు పాల్గొన్నట్లు తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News