అశ్వాపురం, నవంబర్ 14 వై 7 న్యూస్
మండల కేంద్రం లో గల రవీంద్ర పబ్లిక్ స్కూల్ లో గురువారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు , వ్యాసరచన పోటీలు, క్విజ్, స్పెల్ బి , ఉపన్యాస, ఫాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించారు.అనంతరం వారికి బహుమతులు అందజేశారు . పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్ మాట్లాడుతూ, విద్యార్థుల్లోనీ నైపుణ్యాన్ని వెలికి తీయాలని, అదే వారి భవిష్యత్తుకి పునాదిగా మారుతుందని అన్నారు. మాజీ ప్రధాని నెహ్రు కు పిల్లలంటే అమితమైన ప్రేమ అనీ అందుకే ఆయన పుట్టినరోజున బాలల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. బాల్యంలో విద్యార్థులు తమ భవిష్యత్తును ఉన్నతమైన మార్గంలో ఎంచుకోవడానికి దోహదపడుతుందని అన్నారు. పాఠశాల విద్యార్థిని విద్యార్థులు నెహ్రూ గారి వేషధారణతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.









