E-PAPER

లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన లింగంపేట్ ఎస్సై

లింగంపేట్ నవంబర్ 14 వై సెవెన్ న్యూస్ తెలుగు

లింగంపేట మండలంలో
రెండు రోజుల క్రితం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వర్ని ఎస్సై కృష్ణ కుమార్ స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండుగా ఎసిబికి చిక్కిన, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పోలీస్ స్టేషన్లో ఇంకా పోలీస్ బాసులు అక్రమాలకు తావు కల్పిస్తున్నారు. వర్ని ఘటన తోనైనా పోలీస్ బాస్ లో మార్పు వస్తుందని అనుకున్నప్పటికీ, పోలీస్ బాసులలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. దర్జాగా అవినీతికి చోటు కల్పిస్తున్నారు. తాజాగాకామారెడ్డి జిల్లా లింగపేట ఎస్సై అరుణ్, రైటర్ రామస్వామి ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. గురువారం పోలీస్ స్టేషన్ లోనే లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో నిగా వేసి పట్టుకున్నారు ఓ కేసులో శివలింగ గౌడ్ నుంచి రూ 10 వేలు లంచం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గడచిన వారం రోజుల్లో ఇద్దరు ఎస్సై లు ఏసీబీకి పట్టుబడడం గమనార్థం.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News