సిబ్బంది బాధ్యతగా పని చేయాలి
బాగా పని చేసే వారికి రివార్డ్స్, ప్రోత్సాహకం ఉంటుంది – ఎస్పీ.
సూర్యాపేట,నవంబర్ 14 వై 7 న్యూస్;
పోలీస్ స్టేషన్ తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారు నాగారం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసినారు. సూర్యాపేట సబ్ డివిజన్ DSP రవి, నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘువీర్ రెడ్డి, SI ఐలయ్య, స్టేషన్ సిబ్బంది ఎస్పి గారికి గౌరవ వందనంతో స్వాగతం తెలిపినారు. సిబ్బంది యూనిఫాం, పరేడ్ ను పరిశీలించారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్ పరిసరాలు, కేసుల్లో సీజ్ చేసిన వాహనాల శ్రేణిని తనిఖీ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ రిసెప్షన్, పిర్యాదు నిర్వహణ, స్టేషన్ రికార్డ్స్, హిస్టరీ షీట్స్, మండల భౌగోళిక స్థితి, నేరాల నమోదు, కేసుల స్థితిగతులు, కోర్టు క్యాలెండర్, సాంకేతికత మొదలగు వాటిని పరిశీలించారు. అక్రమ రవాణా, అసాంఘి కార్యకలాపాలను నిరోదించాలని సిబ్బందిని ఆదేశించారు. పారదర్శకంగా పోలీసింగ్ ఉండాలి అన్నారు. ప్రజలకు పోలీసు సేవలను వేగంగా అందించాలని సిబ్బందికి తెలిపినారు. సాంకేతిక ను సద్వినియాగం చేసుకుని జట్టుగా పని చేయాలని కోరినారు. గంజాయి రవాణా, వినియోగం నిరోదించేలా బాధ్యతగా పని చేయాలని అన్నారు. పెట్రోలింగ్ పెంచాలని, డయల్ 100 కాల్స్ పై సిబ్బంది వేగంగా స్పందించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవగాహన కల్పించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు పని చేయాలని అన్నారు. సైబర్ నేరాలు జరగకుండా ప్రజలు సైబర్ మోసాలకు గురి కాకుండా అవగాహన కల్పించాలని కోరారు. సిబ్బంది బాధ్యతగా పని చేయాలి, బాగా పని చేసే సిబ్బందికి రీవార్డ్స్, ప్రోత్సాహకాలు ఉంటాయి అని తెలిపినారు. విధులు నిర్వహణ తోపాటు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
ఈ సమావేశం నందు DSP రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వీర రాఘవులు, నాగారం CI రఘువీర్ రెడ్డి, SI ఐలయ్య, DCRB SI యాకూబ్, CC సందీప్, DCRB ASI అంజన్ రెడ్డి, శేఖర్ రెడ్డి, PS సిబ్బంది ఉన్నారు.