మణుగూరు, నవంబర్ 12 వై సెవెన్ న్యూస్;
గత మూడు రోజులుగా TG జెన్కో ఇంటర్ ప్రాజెక్ట్ కబడ్డీ, ఫుట్ బాల్ టోర్నమెంట్స్ KTPS – VII స్టేజ్ పాల్వంచ వారు నిర్వహించగా జెన్కో లోని వివిధ ప్రాజెక్ట్ ల జట్లు పాల్గొనగా భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ జట్టు ఫుట్ బాల్ నందు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ద్వితీయ స్థానం కైవసం చేసుకోవడం జరిగింది..
ఈ సందర్భంగా క్రీడాకారులను బిటిపిఎస్ చీఫ్ ఇంజనీర్ బిచ్చన్న సి.ఈ కార్యాలయంలో అభినందించారు.. సి.ఈ గ మాట్లాడుతూ క్రీడాకారులను మన సంస్థ ఎల్లవేళలా ప్రోత్సాహిస్తుందని వారి కోసం అన్ని హంగులతో క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తుందని ఉద్యోగుల సంక్షేమం మొదటి ప్రాధాన్యత గా ఉంటుందని తెలిపారు..
అలాగే ఉద్యోగులు కూడా సంస్థ అభివృద్ధి కోసం విధులను సక్రమంగా క్రమశిక్షణ , అంకిత, భావంతో నిర్వర్తించాలని సంస్థ అభివృద్దే మన అందరి అభివృద్ధి అని తెలిపారు.. ఈ కార్యక్రమంలో DE/ Tech సత్యనారాయణ మూర్తి, స్పోర్ట్స్ సెక్రటరీ కల్తీ నర్సింహారావు , జట్టు సభ్యులు డి. రమేష్ కెప్టెన్, పి.రవితేజ, యం. నాగేశ్వరరావు, ఆర్. మురళి, జి. విజయ్ రామ్, డి.సురేష్, డి.వెంకటేశ్వర్లు, జి.గని, జి.సంపత్ రెడ్డి,జి.నవీన్ రెడ్డి, పి.రవి కుమార్, సి.హెచ్,ప్రశాంత్,జట్టు మేనేజర్ బి.హేమ్లా, కోశాధికారి సి.హెచ్ సాయి ప్రసాద్, మొదలగువారు పాల్గొన్నారు..